గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి

గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి



  చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం…
*గత వైసిపి ప్రభుత్వం లో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి ను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసినదే కాక, తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన మేరకముడుదాం మండలం  జనసేన పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి..,

తిరుమల తిరుపతి దేవస్థానంలోని  కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ను వాడిన వివాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతికి పాల్పడి స్వామివారి ప్రసాదములో విషపూరిత రసాయనాలతో తయారుచేసిన   నెయ్యిని వాడి లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించీ  భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘనులు ఈ వైసీపీ నాయకులని తెలిపారు, ఈ రోజున సిట్ విచారణ లో విష పూరిత రసాయనాలతో కృత్రిమంగా నెయ్యి తయారు చేసి లడ్డు ప్రసాదం లో ఉపయోగించారని చెప్తే, …దాన్ని తప్పుతోవ పట్టే విధంగా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడలేదని,  ఏమి జరగలేదు అన్నట్టు  వైసీపీ నాయకులు అంతా కలిసి తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మీరు చేసిన అక్రమాలకు, అన్యాయాలకు, పాపాలకు, పొర్లి దండాలు పెట్టినా మీ పాపాలు తొలగిపోవని, ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పక శిక్షిస్తాడని హెచ్చరించారు. పాలు లేకుండా నెయ్యి ను తయారు చేసే ఘనత ఈ ప్రపంచంలో ఒక్క వైసీపీ నాయకులకే చెల్లుతుందని తెలిపారు. పందిని నంది, నందిని పంది చేయగల సమర్థులు వీరనీ, వారు చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదని, మీరు చేసిన అక్రమాలు ప్రజలకు తెలియదనుకోవడం మీ అవివేకం అని గుర్తుంచుకోవాలన్నారు. త్వరలో నిజ ,నిజాలు బయటకి వస్తాయి, మీ అసలు నిజస్వరూపాలు బయటపడతాయి, తప్పు చేసినవాడు తప్పించుకోలేడు,  కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆగ్రహానికి గురికాక తప్పదని, హెచ్చరించారు..
#NoGheeInTTDLaddu

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి