పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు ఏవిధంగా చేపడుతున్నది, ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
జిల్లా ఎస్పీ గారి వెంట సాలూరు పట్టణ సిఐ సిఎచ్.వాసునాయుడు, సాలూరు రూరల్ సిఐ జి.బాలకృష్ణ,పాచిపెంట ఎస్సై నారాయణరావు మరియు విధులు నిర్వర్తిస్తున్న చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.