గురజాడ స్ఫూర్తిగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలును (జంగిల్) క్లియర్ చేయిస్తున్న –  వలి రెడ్డి శ్రీనివాస నాయుడు*

చీపురుపల్లి మండలం

సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడ్పడవాయి దేశమంటే మట్టికాదో దేశమంటే మనుషులు అన్న గురజాడ స్ఫూర్తిగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలును (జంగిల్) క్లియర్ చేయిస్తున్న –  వలి రెడ్డి శ్రీనివాస నాయుడు*
ఈరోజు అలజంగి గ్రామం నుండి మెట్టపల్లి గ్రామం వరకు మెయిన్ రోడ్ లో ఎపుగా పెరిగిన  మొక్కలను జేసీబీతో క్లియర్ చేయూస్తున్నారు 10 రోజుల క్రితం కొంత భాగం క్లియర్ చేయించారు వర్షం వలన పనికి అంతరాయం కలిగింది ఈ రోజు అలజంగి గ్రామం నుండి పని ఎంపీపీ ప్రతినిధి మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం తో కలిసి మొదలు పెట్టారు.
సీనియర్ల నాయకత్వ స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, విస్తృత సేవలు అందిస్తున్నారు. చీపురుపల్లి మండలం నుండి క్రియోశీలకంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు  వలిరెడ్డి తన
సతీమణి శిరీష జడ్పిటిసి గా ఉన్నారు. సీనియర్ నేతలను గౌరవిస్తూ, గ్రామస్థాయి క్యాడర్ను కలుపుకుంటూ పోతున్నారు. ఎల్లవేళలా మండల పార్టీ క్యాడర్ కు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.  చీపురుపల్లి నుండి లావేరు వెళ్లే మార్గంలో ఉన్న ప్రధాన రహదారిలో మలుపులు వద్ద జంగిల్స్ ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో వాహనదారులు ఈ మలుపుల వద్ద ప్రమాదాలకు గురవుతున్నారు. అలజంగి, మెట్టపల్లి, సంకుపాలెం గ్రామాల సమీపంలో ముఖ్య మార్గంలో రోడ్డు కు ఇరువైపులా మొక్కలు ఏపుగా పెరగటంతో, ఆ రహదారి గుండా పయనించే వారు హడాలెత్తి పోతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన యువత విషయాన్ని వలిరెడ్డి శ్రీనివాసనాయుడు దంపతులు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించినవారు జెసిబి ఏర్పాటు చేసి, ప్రమాదాలకు కారణమై, రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను దగ్గరుండి తొలగించేలా చేశారు. ప్రజహిత కార్యక్రమానికి నడుం బిగించిన వలిరెడ్డి చొరవకు పలువురు హార్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు, కనీసం జనానికి ముఖం చూపేందుకు ముందుకు రాని నేతలున్న ప్రస్తుత రోజుల్లో వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారానటంలో ఎటువంటి సందేహం లేదు. తనను నమ్ముకున్న మండల ప్రజానీకానికి కనీస బాధ్యతగా కర్తవ్యం నిర్వహిస్తున్నట్లు వలిరెడ్డి తెలిపారు. కనుకనే, ప్రజల కోసం  ప్రజహిత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.జంగల్స్ క్లియరెన్స్ చేసే చర్యల్లో  అలజంగి సర్పంచ్ రఘుమండ త్రినాథ,  మెట్టపల్లి మాజీ సర్పంచ్ చందక శ్రీనివాసరావు,  ఎంపీటీసీ మీసాల ఈశ్వరావు, రామలింగాపురం మాజీ సోసైటీ అధ్యక్షులు రేవల్ల సత్తిబాబు, మాజీ ఎంపీటీసీ, చింతాడ లక్ష్మణ డి.రాము, ప్రభాత్ కుమార్, బొంతు తిరుపతి, డబ్బాడ ఆనంద్,  వెంకీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *