ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద మంత్రి శ్రీమతి సంధ్యారాణి కూర్చొని, కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలని కోరారు.


ఈ



సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా రంగంలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థి విజయం కీలకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
