అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం బ్రహ్మకుమారిస్ గరివిడి వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షత వరల్డ్ మెడిటేషన్ డే వేడుకలు జరిగాయి.ఈ సందర్బంగా బ్రహ్మకుమారి హేమలత గారు  మాట్లాడుతూ ధ్యానం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, శారీరికంగా,మానసికంగా సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం సులువైన సాధనమని తెలిపారు.అలాగే మనిషిలో మానవత విలువలను పెంపొందించుటకు,వ్యర్థ ఆలోచనలను తొలగించుట ధ్యానం ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు.మరియు విద్యార్థులుకు ధ్యానం పట్ల తగు సూచనలు సలహాలు ఇచ్చారు.అలాగే విద్యార్థులు విద్యతోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో 134 మంది విద్యార్థులు పాల్గొని వారిచే ధ్యానం చేయించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి