సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల వ్యాపారస్తుల వద్దకు వెళ్లి సరదాగా వారితో మాట్లాడుతూ అక్కడ బండి వద్ద పకోడీ వేసి ప్రజలకు ఆకర్షితులయ్యారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.