శ్రీ గణనాధుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు*

శ్రీ గణనాధుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు*




వినాయక నవరాత్రి  ఉత్సవాలులో 11వరోజులో భాగంగా చీపురుపల్లి పట్టణం బ్రిడ్జిడౌన్,  రామాంజనేయ కాలనీ, కస్పావీధిలో గణేష్ పెండల్ కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద  ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీపురుపల్లి మండల అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పిటిసి ప్రతినిధి మరియు విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం, పుష్పం, ఫలం సమర్పిస్తారు. అలాంటి గజముఖు మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా… ఇలా వివిధ రూపాలలో భక్తులకు దర్శనాలు ఇస్తారన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అన్నారు. అన్నదానంలో పాల్గొన్న మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు
నిమర్జనం సమయంలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ‘గణేష్ చతుర్థి’ని, 11 రోజుల వేడుకగా నిర్వహిస్తారు. ఈ పదకొండు రోజుల గణేష్ చతుర్థిలో, నిమజ్జనాన్ని వివిధ రకరకాల కాలానుసారంగా ఒకటిన్నర రోజులు, ఐదురోజులు, ఏడు రోజులు లేదా పదకొండు రోజులుగా నిర్వహిస్తారు ఈ
ఆనందంతో నిర్వహించే ఈ వేడుకలో భాగంగా, నిమజ్జన సమయంలో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి. నిమజ్జన సమయంలో ఎలాంటి అప్రమత్తతను కలిగి ఉండాలి నిమజ్జనంలో పాటించవలసిన జాగ్రత్తలు
గణేష నిమజ్జన సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి మీరు కొన్ని సాధారణ విషయాలు గుర్తుంచుకొని ఉండాలి.
కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వేడుకను సంతోషముగా, సురక్షితంగా ఆస్వాదించవచ్చు.
ఊరేగింపు లేకుండా నిమజ్జనం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. అన్ని వయసుల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఊరేగింపును కార్యక్రమంలో ప్రజలంతా రోడ్లపైన డ్యాన్సులు చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు. ఏ మార్గంలో ఈ ఊరేగింపు నిర్వహించాలి అన్నదానిపై ముందుగానే ఆలోచన చేయాలి. ఈ ఊరేగింపు మార్గదర్శక బాధ్యతలను కనీసం రెండు వ్యక్తులకు అప్పగించాలి. ఒకరు రహదారిపై గల ట్రాఫిక్ ని నియంత్రణ చేస్తే, మరొకరు ఊరేగింపు సరైన దారిలో జరుగుతుంది అన్న విషయంపై నేతృత్వం వహించాలి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చీపురుపల్లి మండల అధ్యక్షులు, జడ్పిటిసి ప్రతినిధి మరియు విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలి రెడ్డి శ్రీనివాస నాయుడు, ఎంపీటీసీ కోరుకొండ దాలయ్య, ఇప్పిలి కృష్ణ, బాయ్స్ హైస్కూల్ కమిటీ చైర్మన్ గవిడి సురేష్, మొండేటి శ్రీను (గాజుల శ్రీను),  శివాలయం డైరక్టర్ ప్రభాత్ కుమార్, యమ్.కృష్ణ, డబ్బాడ ఆనంద్,  నాగచైతన్య, వినోద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి