అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా

ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్…..

మీరు అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా…..

అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రక్కనా! తేల్చుకోండి….

: అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్

పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సమీపంలో గల సెంట్ పీటర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల ఎఐటియుసి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు, ఎఐటియుసి జిల్లా కన్వీనర్ ఆర్. కుమార్ హాజరయ్యారు.

ఈసందర్భంగా ఇవి నాయుడు మాట్లాడుతూ

గత 10 సంవత్సరాల నుండి అసోషియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, దీక్షలు చేసి, కొంత వరకు విజయం సాధించామని, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మా దీక్షా శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పారు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేనిఫెస్టోలో పెట్టాలని, కోరుతున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్షనేతగా అగ్రిగోల్డ్ బాధితుల దీక్షా శిబిరానికి వచ్చి మూడు నెలల్లో పదివేల రూపాయల లోపు బాధితులకు ఆరు నెలల్లో మిగిలిన అందరు బాధితులకు వడ్డీతో సహా చెల్లిస్తామని అలాగే చనిపోయిన బాధితులకు చంద్రబాబు నాయుడు 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు

రాబోయే ప్రభుత్వం మనదేనని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులకు మరో 7లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయలను పువ్వుల్లో పెట్టి పంపిస్తామని చెప్పారని గుర్తు చేశారు.

మరణించిన బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రికి పువ్వులు ప్యాక్ చేసి, ఈ సమావేశం సందర్భంగా కొరియర్ చేయబడుచున్నదని తెలిపారు.

2017 మార్చి నెల 30వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధితుల తరఫున అండగా నిలబడతానని సమావేశాన్ని ఏర్పాటు చేశారని, బాధితుల తరఫున పోరాటం చేస్తానని ప్రశ్నిస్తానని చెప్పి నేటికీ ఏడు సంవత్సరాల కావస్తున్నా ఏ సందర్భంలో కూడా అగ్రిగోల్డ్ బాధితుల అంశాన్ని లేవనెత్తకపోవడం బాధాకరమని అన్నారు.

నేటికైనా అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించి పది లక్షల అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లను సాధించుకొనుటకు తమ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచమని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితుల కోసం 250 కోట్ల కార్పరస్ ఫండ్ విడుదల చేస్తూ జీవోను చేశారని 142 మందికి ఐదు లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా కూడా చెల్లించడం జరిగిందని

అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. గతంలో చేసిన పొరపాటును తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నేడు చేయదని తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా అగ్రిగోల్డ్ అంశాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

యువగళం యాత్రలో అగ్రిగోల్డ్ అంశాన్ని రాష్ట్ర మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో బాధితులకు అండగా నిలబడే విధంగా మాట్లాడాలని కోరుతున్నామన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 252 సార్లు బటన్ నొక్కి అనేక సంక్షేమ పథకాలకు డబ్బులు పంచి పెట్టారని కానీ అగ్రిగోల్డ్ బాధితులు విషయంలో ఇంతవరకు సరైన న్యాయం చేయకపోవడంతో ఈ ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితులు సుమారు పది లక్షల కుటుంబాలు ఈ ఎన్నికల్లో బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

కార్యక్రమంలో పార్వతిపురం మన్యం జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గెంబలి శ్రీనివాసరావు, సాలాపు అనంతరావు, సభ్యులు వెల్లంకి గోవింద, బొండపల్లి శ్రీరాములు, బాసిగాన వెంకటరమణ (చిరు) ఎం. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి