టిడిపి ప్రచారం

టిడిపి ప్రచారం

ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు.

ప్రభుత్వ నిధులను అనుచరులకు దోచిపెట్టిన జగన్అంటూ విమర్శించారు
పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13 వేల కోట్లు మార్చి 16- 30 మధ్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని
సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్, తెలుగుదేశం కాదు. ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు ఖజానాలో నిధులు లేకనే కదా? 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడం సాధ్యం.
జగన్ రెడ్డి స్వార్థ రాజకీయం వల్లే పెన్షన్ దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు 4000 పెన్షన్ అందిస్తుంది.

పెన్షన్ సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సిఎస్ జవహర్ రెడ్డి, సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు

వాలంటీర్లు ప్రజాసేవ కార్యక్రమాలకు కాకుండా జగన్ రెడ్డి వారిని వైకాపా కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశాడు, వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లకు, వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు జగన్ రెడ్డి కారణమయ్యాడు.

వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాక జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల్లా దుర్వినియోగం పరిచినందుకు ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది. పెన్షన్ దారుల పట్ల వైకాపాకు ఏ మాత్రం శ్రద్ధ ఉన్న ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేవాడు కాదు. పెన్షన్లకు నిధులు కొరత పెట్టేవాడు కాదు, సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించకపోవడానికి కారణం నిధులు కొరతయే గాని ఎన్నికల కమిషన్ కాదు. దీనికి రుజువు ఏప్రిల్ మూడవ తారీకు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తారని మార్చి 28న సాక్షి దినపత్రికలో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్తను ప్రచురించింది. ఎందుకు ఇలా సాక్షిలో రాశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే కదా. ఈ వాస్తవాన్ని కనిపెట్టి ఎన్నికల లబ్దికోసం దృస్ప్రచారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో నిమ్మాది తిరుపతిరావు, వాడాడ శోభారాణి, రమేష్ పట్నాయక్, మండా చంద్ర, తాతాజీ, కూనిశెట్టి భీమారావు, డబ్బి కృష్ణ, రెడ్డి ధర్మ, సాంబ, బొత్స నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి