రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రణాలుకాపడమే కాకుండా మన ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ మార్చి 23 శనివారం నాడు కోంకి వీధి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపం,సాలూరు లో స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్,రాజు గురు,సుగుదేవ్ ల వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రక్త సేకరణ అనేది తల సేమియా,సికిల్ సేమియా, వ్యాధిగ్రస్తులు కాకుండా క్యాన్సర్,గర్భిణీ స్త్రీలకు మరియు అప్పటికప్పుడే రోడ్డు ప్రమాదం లో గాయపడి,అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం ఈ రక్త సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు.
కావున రక్తదానం పై అవగాహన చేసుకుని స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారి ప్రాణాలు కాపాడే వారు అవుతాము అని సంస్థ సభ్యులు తెలియజేశారు..