సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి వెళ్లి పట్టణ టిడిపి జనసేన నాయకులను కార్యకర్తలను కలుసుకొని కూటమి గెలుపు పై సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కూటమి త్రివేణి సంగమం అంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటుందని రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుందని ఈ పరిపాలన ఇకపై జరగనివ్వకుండా అభ్యర్థులను గెలిపించాలని దేశంలో బిజెపి ప్రభుత్వం మాత్రమే మహిళలకు గిరిజనులకు ప్రాధాన్యతను ఇస్తుందని కచ్చితంగా ఈసారి కూడా బిజెపి కేంద్రంలో నెగ్గుతుందని ఈమె తెలిపారు. ఇంకా రాష్ట్రాలో జగన్ పరిపాల నియంత పాలన అని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఈసారి కూటమి అద్యర్ధులకి ఓటు వేసి రా
ష్ట్రని అభివృద్ధి వైపు తీసుకెళ్లే బాధ్యత అందరి పైన ఉంది అని ఈమె తెలిపారు .అంతేకాకుండా అరుకు పరిసర ప్రాంతాల్లో అమాయకమైన గిరిజనులపై గంజాయి నాటు సారా వంటి తప్పుడు కేసులు వాళ్లను జైలు పాలు చేస్తున్నారని అక్రమ మైనింగులు వంటి కార్యకలాపాలకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇలాంటి వాటి నుంచి ఆరకు చుట్టుపక్కల గిరిజనులను రక్షిస్తానని వారి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని గిరిజనులు పట్టాలు రిజిస్ట్రేషన్ మరియు సొంత ఇల్లు కలను నెరవేరుస్తారని సాలూరు నియోజకవర్గం లో పెండింగ్ ఉన్న పనులను రైల్వేస్టేషన్లో
కోటియా సమస్యను పరిష్కరిస్తానని పత్రికా ముఖంగా తెలిపారు