విజయనగరం | 24-08-2026

సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సీతం కళాశాల ప్రాంగణంలో సోమవారం ‘సహా’ సినిమా చిత్రబృందం సందడి చేసింది. కళాశాలకు విచ్చేసిన చిత్రబృందానికి విద్యార్థులు ఉత్సాహభరితమైన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చిత్రబృందం విద్యార్థులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలు, చిత్రీకరణ అనుభవాలు, సినిమా రంగంలోని అవకాశాలు, సృజనాత్మకత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి అంశాలను పంచుకున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, తమ లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

నిశాంత్ దోతీ దర్శకత్వంలో రూపొందిన ‘సహా’ చిత్రంలో శివకుమార్ కసరం హీరోగా, శ్వేతా లక్ష్మణ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తేజ వెల్లపుచర్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొండారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయిక శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సాలూరు శ్వేత కూడా విజయనగరం ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. విజయనగరం ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులకు సినిమా వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు లభించడం గర్వకారణమన్నారు.

విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి

సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశి భూషణరావు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు తమలో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను గుర్తించి, వాటిని ఏ రంగంలోనైనా సద్వినియోగం చేసుకుని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

సినిమా రంగం మాత్రమే కాకుండా ప్రతి రంగంలోనూ ప్రతిభకు అవకాశాలు ఉన్నాయని, తమ ఆసక్తిని గుర్తించి దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగగలరని ఆయన అన్నారు.

‘సహా’ చిత్రం సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, విద్యార్థులు, యువత మరియు విజయనగరం ప్రజలు చిత్రబృందాన్ని ప్రోత్సహించి సినిమాను ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీతం కళాశాల యాజమాన్యం తరఫున ‘సహా’ చిత్రబృందాన్ని ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా విజయనగరం ప్రాంతానికి చెందిన హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ తల్లిదండ్రులు శ్రీ లక్ష్మణ్ మరియు శ్రీమతి లక్ష్మణ్ దంపతులను సత్కరించారు.

విజయనగరం నేల నుంచి వెండితెరకు ఎదుగుతున్న శ్వేతా లక్ష్మణ్‌కు సీతం కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ‘సహా’ చిత్రం ఘన విజయం సాధించాలని డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశి భూషణరావు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి