విజయనగరం, ఆగస్టు 23, నగర పరిధిలో కేసు దర్యాప్తు నిమిత్తం వెళుతున్న పోలీసు వాహన ప్రమాదం జరగటం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గాజుల రేగ కొండమీద పోలీసు వాహనం బోల్తా పడిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్ తో ప్రమాద సంఘటన వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న మెడికవర్ ఆసుపత్రి వద్దకు వెనువెంటనే మంత్రి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ రాజారావు లను పరామర్శించారు. అనంతరం ప్రమాద బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. అనుకోని ప్రమాదంలో గాయపడిన పోలీసు మిత్రులకు పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కోరారు. బాధితుల కుటుంబ సభ్యులతో మంత్రి కొండపల్లి మమేకమై మాట్లాడారు. వైద్యం జరుగుతున్న తీరును ఎస్పీ దామోదర్ మరియు ఇతర పోలీసు అధికారులను మంత్రి కొండపల్లి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సంఘటన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి, హోం మంత్రి వంగలపూడి అనిత గారికి వివరించినట్లు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధాతప్త హృదయంతో మాట్లాడగా, ఎస్పీ దామోదర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్ఐ వి అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జీ నాగేంద్రప్రసాద్, కానిస్టేబుల్ కం డ్రైవర్ కే రాజబాబు, కానిస్టేబుల్ సిహెచ్ వెంకటరమణ కేసు దర్యాప్తు నిమిత్తం వెళుతుండగా వాహనానికి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యులు శాయశక్తులా కృషి చేసినప్పటికీ ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో చాకచక్యంగా పనిచేసే కానిస్టేబుల్ ఎస్ వెంకట రమణ మృతి చెందటం బాధాకరమైన విషయం అని మంత్రి కొండపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజబాబుకు నడుము వద్ద ఆపరేషన్ అవసరం కావడంతో ఆపరేషన్ చేస్తున్నారని, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పిందని మంత్రి కొండపల్లి వివరించారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ కుమార్ కు ఎడమ కాలు విరిగిందని, జి నాగేంద్ర ప్రసాద్ కు ఎడమ చేయి విరిగినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది ధైర్యంగా ఉండాలని మంత్రి కొండపల్లి కోరారు. మెడి కవర్ వైద్య బృందం పోలీస్ సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆదేశించారు. Spread the love టపా నావిగేషన్ భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర