డోలి కష్టాలు

డోలి కష్టాలు

ఇంకా ఎన్నాల్లు డోలీ మోతలు..!

రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గిరిశిఖర గ్రామం గుమ్మడంగికి చెందిన మెల్లిక బందాయమ్మ నిండు గర్భిణి. బుధవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో గ్రామస్థులు 6 కి.మీ. దూరం డోలీలో ఎంతామర (ఒడిశా) మైదాన ప్రాంతానికి మోసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఆటోలో 30 కి. మీ. దూరంలో ఉన్న కూనేరు-రామభద్రపురం ఆసుపత్రికి తరలించారు. గుమ్మడంగి నుంచి పూడేసు పంచాయతీకి వెళ్లాలన్నా 15 కి.మీ. డోలీలో మోసుకెళ్లాల్సిందేనని బాధితులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి