ఆంధ్ర ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాలైన కోటియ(దిగువ గంజాయి భద్ర) ప్రాంతంలో ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గురువారం నాడు కొత్త మీటర్లు వేయడానికి వెళ్లగా అక్కడ ఒరిస్సాకు చెందిన పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ వారికి అక్కడ గ్రామస్తులు మీటర్ల కోసం దరఖాస్తు చేయగా గత కొద్ది రోజులుగా అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మీటర్ల బిగించడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న ఒరిస్సా పోలీసులు విద్యుత్ అధికారులను నిర్బంధించి ఉంచారు. ఇది తెలుసుకున్న ఆంధ్ర ప్రదేశ్ అధికారులు ఒరిస్సా అధికారులతో సంప్రదించి వీళ్ళని విడిపించారు
![](https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240329_112835637867770680868101247.jpeg)
![](https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240329_112838064083574811102747106-300x169.jpeg)