విజయనగరం,జూన్ 17: మహిళల హక్కులకు భంగం కలగకూడదని,అలా భంగం కలిగిననాడు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని గ్లోబల్ స్పూర్తి మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బలగ రాధానాయుడు అన్నారు.బుధవారం ఉదయం స్థానిక దాసన్నపేట రైతుబజార్ వద్ద గల సంఘం కార్యాలయంలో విజయనగరం నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ మహిళలపై దాడులు పెరిగాయని,మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన,గ్రుహ హింసకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకోవాలని చట్టాల్లో ఉన్నప్పటికీ కొంతమంది సహకారంతో తప్పించుకుంటున్నారని,అలాంటి సందర్భాల్లో బాధిత మహిళకు న్యాయ జరిగేవరకు పోరాడతామని అన్నారు.సంఘం గౌరవ సలహాదారు మమ్ముల తిరుపతిరావు మాట్లాడుతూ మహిళలు తమ హక్కులతో పాటు భాద్యతలు కూడా తెలుసుకొని వ్యవహరించాలని,తమ కుటుంబాల ఎదుగుదలతో పాటు పిల్లల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.తమ పిల్లలు తప్పు చేస్తే సమాజం మీద నెట్టేయకుండా మంచి పౌర సమాజం నిర్మాణం కోసం అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ప్రతీ ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనే ప్రభుత్వ ఆశయాలను, పధకాలను సద్వినియోగం చేసుకోవాలని,ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని కోరారు.స్పూర్తి మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలుగా బిరోజా గజపతి, ఉపాధ్యక్షురాలు వై.యోగీశ్వరి, కార్యదర్శిగా రౌతు భారతి,సంయుక్త కార్యదర్శిగా పి.భవానీ, కోశాధికారిగా ఉప్పల అనిత,ఈసి మెంబర్లగా జి.భవానీ,వై.సత్యవతి,మోహన్ సాయి,ప్రగడ లక్స్మిలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులతో పాటు న్యాయ శాస్త్ర విద్యార్థులు కట్టమూరి వాణి,కలిశెట్టి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ యువత జీవితాలను నాశనం చేసే వ్యసనాలను క్రీడలతో దూరం చేయాలి *