సునీత రెడ్డి విజయనగరం *సిరి సహస్ర పుట్టినరోజు సందర్బంగా* *ఉచిత కంటి వైద్య శిబిరం* *కంటుబోతు రాంబాబు, బుగత సత్యనారాయణ గార్ల ఆధ్వర్యంలో* *పద్మనాభంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం*: *ముఖ్య అతిథిగా హాజరైన సిరి సహస్ర* పద్మనాభం, జూన్ 17: భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం మద్ది గ్రామం జంక్షన్‌లో బుధవారం శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర పుట్టినరోజు వేడుకల సందర్భంగా, పద్మనాభం ఎంపీపీ కంటుబోతు రాంబాబు, బుగత సత్యనారాయణ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, సిరి సహస్ర హాజరయ్యారు. సిరమ్మ గారి పుట్టినరోజు సందర్బంగా ఉచిత వైద్య కంటి శిబిరంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శంకర్ ఫౌండేషన్ వైద్యులు పలువురు గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షలు తోట వాసు,ప్రజా ప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు యువత జీవితాలను నాశనం చేసే వ్యసనాలను క్రీడలతో దూరం చేయాలి *