విజయనగరం, జూలై 15: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, విజయనగరం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) మాతృవియోగం చెందారు. అయన మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి(83) మంగళవారం ఉదయం పరమపదించారు. ఆత్మీయుల సందర్శనార్ధం ఆమె భౌతికకాయాన్ని ప్రదీప్ నగర్ లోని చిన్నశ్రీను నివాసంలో ఉంచారు. బుధవారం ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. *మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం..* చిన్నశ్రీను మాతృమూర్తి స్వర్గస్తులైన సమాచారం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణవేణమ్మ మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలుస్తూ, విలువలతో కూడిన జీవితం గడిపిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. కాగా కృష్ణవేణమ్మ శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువు కావడంతో వారి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. *ప్రముఖులు పరామర్శ :* చిన్న శ్రీను మాతృ వియోగం సమాచారం తెలుసుకున్న ఆత్మీయులు, అభిమానులు, కుటుంబ సభ్యులు వేల సంఖ్యలో ప్రదీప్ నగర్ లోని వారి నివాసానికి చేరుకున్నారు. కృష్ణవేణమ్మ భౌతికకాయన్ని సందర్శించి అశ్రునివాళులర్పించారు. చిన్నశ్రీనుకు తమ ప్రగాఢ సంతాపంను తెలియచేశారు. మాజీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఇందుకూరి రఘురాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యేలు శంభంగి చిన్న అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ధర్మశ్రీ, చింతలపూడి వెంకట రమణయ్య, అలజంగి జోగారావు, తలై భద్రయ్య శోభ హైమావతి, విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, భాగ్యలక్ష్మి, మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి, నియోజకవర్గ సమన్వయకర్తలు తలై రాజేష్, మల్ల అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తదితరులు హాజరై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. చిన్న శ్రీను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. Spread the love టపా నావిగేషన్ రహదారి భద్రత, నేర నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మిక తనిఖీలు అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం-జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర రెడ్డి