సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ యాత్రలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. తిరంగా యాత్రలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి సంధ్యారాణి యువత, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటుతూ ర్యాలీ ముందుకు సాగింది. భారీగా తరలివచ్చిన యువత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ సమైక్యతకు నినాదాలు చేశారు. దేశ సమైక్యత, అఖండత, దేశభక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా తిరంగా యాత్ర సాగింది. దేశభక్తి నినాదాలతో సాలూరు పట్టణం మార్మోగింది. Spread the love టపా నావిగేషన్ కోదుకరకవలసలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం వైయస్సార్సీపి సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలి