విశాఖపట్నం, తేది: 09-09-2026: విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఐదు జిల్లాల ఎస్పీలు భౌతికంగా సమావేశానికి హాజరుకాగా, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు మరియు ఇతర సంబంధిత అధికారులు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
విశాఖపట్నం రేంజ్ పరిధిలో 31-08-2026 నాటికి నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, నేరస్తులపై చర్యలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై రేంజ్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో క్రింది ప్రధాన అంశాలపై సమీక్ష చేసి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయబడినవి.
1. మహిళలపై నేరాలు: మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించబడింది. అత్యాచారం, వరకట్న మరణాలు, POCSO మరియు ఇతర మహిళా సంబంధిత కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న UI కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించబడింది. బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
2. ఆస్తి నేరాలు – రికవరీ: దొంగతనాలు, రాబరీ, హౌస్ బ్రేకింగ్ మరియు స్నాచింగ్ కేసుల్లో నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, దొంగిలించబడిన ఆస్తులను గరిష్ఠ స్థాయిలో రికవరీ చేయాలని ఆదేశించారు. పెండింగ్ UI కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి, కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
3. SC & ST (PoA) Act అమలు: SC/ST వర్గాలకు సంబంధించిన కేసుల్లో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల్లో అరెస్టులు, కుల ధృవీకరణ పత్రాలు, కోర్టు స్టేలు, RFSL నివేదికలు, లీగల్ ఒపీనియన్ తదితర కారణాలతో పెండింగ్‌లో ఉన్న కేసులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని త్వరగా పరిష్కరించాలని సూచించారు.
4. అక్రమ పశువుల రవాణా: ఆవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు మరియు ఇతర ముఖ్య ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2026లో రేంజ్ పరిధిలో ఈ అంశానికి సంబంధించి కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసినట్లు సమీక్షలో వెల్లడైంది.
5. బాణసంచా & భద్రతా లైసెన్సింగ్: బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు, మ్యాగజైన్లు మరియు స్టోరేజ్ పాయింట్లలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. లైసెన్స్ లేని యూనిట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు, లైసెన్సుల పరిస్థితిని నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు.
6. పోలీసు అధికారులపై దాడులు: విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో దర్యాప్తును త్వరగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సూచించారు.
7. అదృశ్యమైన వ్యక్తుల గుర్తింపు: ముఖ్యంగా అదృశ్యమైన బాలికలు మరియు బాలుర కేసులను ప్రాధాన్యతతో తీసుకొని, వారిని త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. 2026లో రేంజ్ పరిధిలో నమోదైన 145 బాలికల మిస్సింగ్ కేసుల్లో 142 మందిని, 32 బాలుర మిస్సింగ్ కేసుల్లో 30 మందిని గుర్తించినట్లు సమీక్షలో వెల్లడైంది.
8. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల తగ్గింపు: రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ఇంజినీరింగ్ లోపాలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. 2026 ఆగస్టు 31 వరకు రేంజ్‌లో 690 ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు నమోదైనట్లు సమీక్షలో వెల్లడైంది.
9. Integrated Check Posts: ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు రేంజ్‌లోని 21 చెక్‌పోస్టుల ద్వారా 45 కేసులు నమోదు చేసి 1,741.043 కిలోల గంజాయి మరియు 14 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమీక్షలో వెల్లడైంది.
10. NBWs అమలు: పెండింగ్‌లో ఉన్న Non-Bailable Warrants (NBWs)ను ప్రత్యేక డ్రైవ్ ద్వారా అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా NDPS, ఆస్తి నేరాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు తదితర తీవ్రమైన కేసుల్లో పెండింగ్ NBWsను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు. 07-09-2026 నాటికి VSP Rangeలో మొత్తం 1,277 NBWs పెండింగ్‌లో ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది.
11. Smart Policing & Unit Metrics: ప్రతి యూనిట్‌లో నేరాల విశ్లేషణ, కేసుల పురోగతి, పెండింగ్ UI కేసులు, అరెస్టులు, ఛార్జ్‌షీట్లు, రికవరీలు తదితర అంశాలను డేటా ఆధారంగా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
NDPS – ప్రత్యేక సమీక్ష
12. NDPS కేసులపై కఠిన చర్యలు: గంజాయి అక్రమ రవాణా, నిల్వ మరియు పంపిణీపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 2024 నుంచి 31-08-2026 వరకు VSP Rangeలో 1,215 NDPS కేసులు నమోదు చేసి, 72,065.73 కిలోల గంజాయి, 100.89 కిలోల హ్యాషిష్ ఆయిల్ మరియు 78 గ్రాముల ఓపియం స్వాధీనం చేసుకున్నట్లు సమీక్షలో వెల్లడైంది.
13. Financial Investigation: Commercial quantity NDPS కేసుల్లో నిందితుల ఆర్థిక కార్యకలాపాలను గుర్తించి Financial Investigation నిర్వహించాలని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి చట్టప్రకారం ఫ్రీజింగ్/అటాచ్మెంట్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
14. PIT NDPS Act: పునరావృతంగా NDPS నేరాలకు పాల్పడుతున్న మరియు సమాజానికి ప్రమాదకరంగా ఉన్న నిందితులపై PIT NDPS Act కింద preventive detention చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
15. Absconding Accused Drive: NDPS కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. వారి backward link, transporter, supplier, peddler మరియు forward linkలను గుర్తించి మొత్తం నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. రేంజ్‌లో మొత్తం 2,062 మంది absconding accused వివిధ కేటగిరీల్లో ఉన్నట్లు సమీక్షలో చూపబడింది.
16. Repeat Offenders: పునరావృతంగా NDPS కేసుల్లో పాల్గొంటున్న నిందితులను గుర్తించి History Sheets/Surveillance చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇతర జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించాలని సూచించారు.
17. Seized Vehicles Disposal: NDPS కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన disposal చేయాలని ఆదేశించారు. 31-08-2026 నాటికి రేంజ్‌లో మొత్తం 3,400 వాహనాలు పోలీస్ స్టేషన్లలో ఉండగా, వాటిలో 2,088 వాహనాలు judicial clearance కోసం పెండింగ్‌లో ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది.
Cyber Crime – ప్రత్యేక సమీక్ష
19. Financial Frauds: సైబర్ ఆర్థిక మోసాల్లో బాధితుల డబ్బును వీలైనంత త్వరగా freeze చేసి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి బాధితులకు తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 31-08-2026 నాటికి June 2024 నుంచి రేంజ్‌లో 411 Financial Fraud cases నమోదై, సుమారు ₹45.97 కోట్లు నష్టం జరిగినట్లు సమీక్షలో వెల్లడైంది.
20. 1930 & NCRP Complaints: 1930 హెల్ప్‌లైన్ మరియు NCRP ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, ప్రారంభ దశలోనే బ్యాంకులు మరియు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసి బాధితుల డబ్బును freeze చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. June 2024 నుంచి 31-08-2026 వరకు మొత్తం 14,164 ఫిర్యాదులు నమోదైనట్లు సమీక్షలో వెల్లడైంది.
21. Digital Arrest మోసాలు: Digital Arrest పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఇటువంటి కేసుల్లో నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. బాధితులకు పోలీసుల పేరుతో వీడియో కాల్స్/ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
22. Social Media Crimes: సోషల్ మీడియా ద్వారా అసభ్యకర, అభ్యంతరకర లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు content removal/takedown requests పంపాలని సూచించారు.
23. రాబోయే ఎన్నికలు, పండుగలు & ప్రజా భద్రత
రాబోయే సాధారణ ఎన్నికలు, పండుగలు, జాతరలు, మతపరమైన కార్యక్రమాలు, VIP/VVIP పర్యటనలు మరియు ఇతర ప్రజా కార్యక్రమాల నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికతో తగిన బందోబస్తు, ట్రాఫిక్ మరియు శాంతిభద్రతల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
• ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన మరియు సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన Preventive చర్యలు చేపట్టాలి.
• రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, పాత నేరస్తులు మరియు సమస్యాత్మక వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
• అక్రమ మద్యం, నగదు, గంజాయి, డ్రగ్స్, ఆయుధాల రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలి.
• పండుగలు, జాతరలు మరియు భారీ ప్రజా సమూహాలు జరిగే ప్రాంతాల్లో Crowd Management, Traffic Management మరియు మహిళల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
• Social Media Monitoring ద్వారా పుకార్లు, రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి.
• మతపరమైన కార్యక్రమాల సందర్భంగా అన్ని వర్గాల మధ్య సమన్వయం, శాంతి మరియు సౌభ్రాతృత్వం కాపాడే విధంగా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి.
• ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ ప్రాంతాలు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో అదనపు నిఘా మరియు గస్తీ ఏర్పాటు చేయాలి.
• పండుగల సమయంలో రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ & డ్రైవ్, ఓవర్‌స్పీడ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలి.
• అన్ని జిల్లాల్లో Emergency Response, Fire Safety, Medical Services మరియు ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి.
• ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా Beat Policing, Night Patrolling మరియు Preventive Policingను మరింత బలోపేతం చేయాలి.
• ప్రతి జిల్లాలో ఏర్పాట్లు మరియు బందోబస్తు ప్రణాళికలను ముందుగానే సమీక్షించి, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
మొత్తంగా, నేర నియంత్రణలో Preventive Policing, Technology-based Policing, Faster Investigation, Effective Prosecution, Pending Cases Disposal మరియు Inter-State Coordinationకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే స్టానిక ఎన్నికలు, పండుగలు మరియు ప్రజా కార్యక్రమాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు ముందస్తు నివారణ చర్యలను మరింత పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల అధికారులు సంబంధిత విభాగాలు మరియు శాఖలతో సమన్వయం చేసుకొని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా పనిచేయాలని సమావేశంలో ఆదేశించబడింది

.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి