పార్వతిపురం మన్యం జిల్లా
సాలూరు పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలుపరుస్తుందని అంతేతప్ప కొత్తగా వీళ్లు చేసిందేమీ లేదని తెలిపారు.పాచిపెంట మండలం పారమ్మ కొండకు మంజూరైన నిధులు ఈ సంవత్సరం మార్చిలో వైసిపి హయాంలో విడుదల చేసినవని ఈ నిధులను మేమే తెప్పించుకున్నామన్నట్టు గొప్పలు చెప్పుకుంటూ పోతున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ఎద్దేవా చేశారు.ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరస్తారు ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు OPS గాని అమలు పరిస్తే నేను ఇక ఎన్నికల్లో పోటీ చెయ్యను అని రాజన్న దొర సవాల్ విసిరారు.