సాలూరు పట్టణ బీజేపీ కార్యాలయం లో ఈరోజు ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులో ఎన్నికల కోడ్ వస్తుంది అని మన రాష్ట్రం లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గా సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి గుమ్మడి సంధ్యారానికి బిజెపి తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అరకు పార్లమెంట్ ఎంపీ టికెట్ కొరకు ఎవరిని సూచిస్తే వాళ్లకి మా పూర్తి మద్దతు తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లాకార్యదర్శి తాడ్డి సూర్యనారాయణ,కన్వీనర్ జాన్ని సింహాచలం, రేవల్ల లక్ష్మణారావు,గొర్రెల ప్రసాద్,టౌన్ ప్రెసిడెంట్ కోలగట్ల గోపి మరియు నాలుగు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.