పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం అని నిత్యఅవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని గత వైసిపి ప్రభుత్వాన్ని సాండ్ ల్యాండ్ మైండ్ వైన్ మాఫియా అంటూ వేలెత్తి చూపున ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇసుక విషయంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా చేసిందని ప్రైవేటు వ్యక్తులకు ఆదాయాన్ని చేకూర్చేలా చేసిందని అదేవిధంగా వైన్ షాపుల్లో కూడా 80% టిడిపి వారికి వచ్చాయని ఇంకా లిక్కర్ విషయానికొస్తే బాబు 99 రూపాయలకే మద్యం అంటూ ప్రజలను నమ్మబరుస్తున్నారని కుటమిలో రాజ్యాంగ విరుద్ధ శక్తులు నాయకులు గా పరిపాలన చేస్తున్నారని, ఇంకా ల్యాండ్ passbooks విషయానికి వస్తే గత ప్రభుత్వం పాస్ పుస్తకాల్లో జగనన్న ఫోటో ఉందని ప్రజల భూములను జగన్ లాక్కుంటాడని ఈ కూటమి నాయకులు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ మంత్రి ఫోటోలు ప్రస్తుతం పాస్ పుస్తకాలపై ముద్రిస్తున్నారని అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల భూములు లాక్కుంటారా అని ప్రశ్నించారు. పల్లె పండుగ అంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమం శుద్ధ దండగని పాత పనులకు కొత్త శంకుస్థాపన చేస్తున్నారని ఇక సాలూరు నియోజకవర్గానికి వస్తే మక్కువ నుండి సాలూరు వరకు ఉన్న రోడ్ను చూపించి ఓట్లు దండుకున్న మంత్రి సంధ్యారాణి 56 కోట్లు వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన నిధులను ఇప్పటివరకు ఎందుకు మక్కువ రోడ్డు పనులు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 100 కోట్లతో నేను మంజూరు చేసిన పనులు ఎందుకు ఇంకా చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. హడావుడిగా సాలూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రాగునీరు మరుగుదొడ్లు పనులు పూర్తి చేసి చూపిస్తాను అని చెప్పిన మంత్రి సంధ్యారాణి ఇప్పటివరకు ఎక్కడ పనులు చేశారో తెలియజేయాలని రాజన్న దొర తెలిపారు.