పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలు, నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి
సాలూరులో డీలక్స్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు నేలపై ఆత్మగౌరవ నినాదం మారుమ్రోగించిన తెలుగు పౌరుషం స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అని
సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపకులు, కలియుగ పురుషులు అన్న నందమూరి తారకరామారావు అని
చరిత్ర పుటలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న యుగపురుషులు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం అన్న నందమూరి తారకరామారావు అని
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి సేవా స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని
ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇచ్చి ఆడపిల్లలకి గౌరవం, మర్యాద పెంచిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని
ఎన్టీఆర్ గారి ఆశయాలను పునుకుపుచ్చుకొని ముందుకు వెళ్తున్న నారా చంద్రబాబునాయుడు గారికి మనమందరం తోడుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని మంత్రి సంధ్యారాణి కోరారు



