ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలు తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్ చేశారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన సుంకి, పాచిపెంట
దట్టమైన అడవి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అక్కడ ఆయుధాలు తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు బిఎస్ఎఫ్ డికాయ్ 65 బెటాలియన్ కి చెందిన కమాండ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సందీప్ సోమవారం ఒరిస్సామీడియాకు వెల్లడించారు. ఆయుధాలు తయారీ కేంద్రం పార్వతిపురం జిల్లా పాచిపెంట మండలం కుంతం, బడే వలస పద్మాపురం గ్రామాలకు సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు ఎన్నికల నేపథ్యంలో ఒడిస్సా లోని సుంకి క్యాంపు బిఎస్ఎఫ్ జవాన్లు ఏవోబి అడవుల్లో గాలింపు చేపట్టగా అదే సమయంలో ఏఓబి సరిహద్దు వద్ద సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను వారు ప్రశ్నించగా అక్కడ ఆయుధాలు తయారు కేంద్రం కోసం సమాచారం తెలిసిందని అక్కడికి వెంటనే చేరుకొని తుపాకీ తయారీ వినియోగించే హ్యాండ్ బౌలర్ ట్రెజర్ మెకానిజం కత్తులు ఇనుప బిట్లు రంపం తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు బోర్డర్ చెక్పోస్ట్ అయినా కోనవలస దండిగా పద్మాపురం తదితర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు