చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ

చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ

*చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 27వ వార్షికోత్సవ జాతర 02-03-2025 ఆదివారం నుంచి 04-03-2025 మంగళవారం వరకు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ గవిడి నాగరాజు గారు* , వైస్ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు నన్ను ఆహ్వానించడం జరిగింది. అమ్మవారి దేవాలయము నందు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో మూడు రోజులు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారి దేవాలయమునకు జాతర దినముల్లో అమ్మవారి దర్శనమునకు సుమారు లక్ష మంది భక్తుల వరకు వస్తారు. ఎందుకంటే సుమారు 18వ శతాబ్దంలో అమ్మవారు ఒక భక్తురాలి స్వప్నములో కనబడి నేను మీ గ్రామ దేవతగా వెలిసియున్నాను నాకు గుడి నిర్మించి పూజలు చేసిన ఎడల మీరు కోరిన కోర్కెలు తీర్చేదినని చెప్పి మాయమైపోయారు అని అప్పటి పెద్దలు మాట, ప్రస్తుతం అమ్మవారిగా చీపురుపల్లి గ్రామ దేవతగా *శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిగా* కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులపాలిట బంగారమై విరజిల్లుతున్నారు.
శ్రీ అమ్మవారి దేవాలయం నందు ప్రతి ఆదివారం అమ్మవారికి పంచామృత శాఖము భక్తుల కోరిన కోరికలు తీరేవారు అమ్మవారికి ప్రభలు కట్టి వారి మొక్కులను చెల్లించు కొనుట ఇక్కడ ఆనవాయితీ మరియు ప్రతి ఆదివారము భక్తుల సహాయ సహకారంతో అన్నదానము మరియు సాయంత్రం 6:00 నుండి నక్షత్ర హారతి ఆషాడమాసం లో శ్రీ అమ్మవారికి సారే శ్రావణమాసం మరియు దేవి నవరాత్రుల్లో సామూహిక కుంకుమార్చనలు ప్రతి పౌర్ణమికి చండీ హోమం దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం సందర్భముగా పిల్లలకు ఉచిత పుస్తకముల పంపిణీ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని. అంతేకాకుండా జాతర మహోత్సవాల్లో భాగంగా మూడు రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవముగా జరుగుతాయి అని కాబట్టి ఇలాంటి చరిత్ర గల అమ్మవారి జాతరకు నాకు ఆహ్వానం అందించి దైవ దర్శనానికి పాత్రులు చేసినందుకు ఆలయ కమిటీకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి