ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు

ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు

ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు

చీపురుపల్లి: 22.12.2025
మానవీయ కోణంలో కూటమి ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. నేడు చీపురుపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹1,52,000/- విలువైన చెక్కులను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.

నేడు లబ్ధి పొందిన వారు:
* వైశ్యరాజు సాంబమూర్తి: ₹35,000/-
* గవిరి లక్ష్మణనాయుడు: ₹57,100/-
* శనపతి లక్ష్మి: ₹30,000/-
* శంకరపు భారతి: ₹30,000/-

గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి భిన్నంగా, నేడు పారదర్శకమైన పాలనను ప్రజల దగ్గరకు చేరువ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సామాన్యులకు సాయం త్వరితగతిన అందేలా వ్యవస్థను ప్రక్షాళన చేశారని కొనియాడారు.

స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారి చొరవతో, ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటి వద్దకే సాయం అందడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజల కష్టాలను తీర్చడమే మా ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత. అది మాటల్లో కాదు.. మా చేతల్లో చూపిస్తున్నామని ఈ సందర్భంగా యువనేత రామ మల్లిక్ నాయుడు స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి