ప్రజల మనిషిగా బస్సులో వచ్చి.. చీపురుపల్లి వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

ప్రజల మనిషిగా బస్సులో వచ్చి.. చీపురుపల్లి వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

విజయనగరం జిల్లా…..


చీపురుపల్లి నియోజకవర్గం,

   చీపురుపల్లి ప్రజల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అద్భుత పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులో భాగంగానే, నేడు చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) అట్టహాసంగా ప్రారంభమైంది.

ప్రజా నాయకత్వానికి నిదర్శనం..
ఈ ప్రారంభోత్సవం ఎంతో సాదాసీదాగా, ప్రజాప్రతినిధులు సామాన్యుల మధ్య జరగడం విశేషం. గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు, ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు యువనాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు ,స్థానిక టీడీపీ కార్యాలయం నుండి సామాన్య ప్రయాణికులతో కలిసి RTC బస్సులో ప్రయాణించి వంతెన వద్దకు చేరుకున్నారు.


ఒక సామాన్యుడిలా బస్సులో వచ్చి బ్రిడ్జిని ప్రారంభించడం వారి ప్రజా ముద్రకు నిదర్శనం.

ఎమ్మెల్యే కళావెంకటరావు గారు, ఎంపీ అప్పలనాయుడు  మరియు యువ నాయకులు కిమిడి రామ మల్లిక్ నాయుడు కలిసి జెండా ఊపి బ్రిడ్జిని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ప్రెస్ మీట్ లో  కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేశారు.

ఈ వంతెన నిర్మాణంతో నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలు తీరాయని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ  కార్యక్రమంలో  ఏపీఎస్ఆర్టీసీ మన్యం జిల్లా  డి పిటిఒ,పి. వెంకట్రావు, విజయనగరం జిల్లా DM శ్రీనివాసరావు, పాలకొండ ఏఎమ్టిఐ యు రమేష్ పాల్గొనడం జరిగింది 47 బస్సులు ఈ మార్గం గుండా ప్రారంభించడం జరిగింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి