పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు – ముగ్గురు అరెస్ట్ : సాలూరు పట్టణ పోలీసులు*
సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారం తో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా అనుమతి లేకుండా, రవాణా చేస్తున్న 27 పశువులున్న ఉన్న ఒక వాహనం ను గుర్తించారు. ఈ పశువులు తరలింపుకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేకపోవడంతో, తరలింపు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఘటనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని,ఈ ఘటనపై పశు క్రూరత్వ నిరోధక చట్టం మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న పశువులను సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పోలీసు వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.



