పేస్ యాప్ లను వెంటనే రద్దు చేయాలి

పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలి పనిచేసిన 14 రోజులకే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పాచిపెంట మండలం పాంచాలి గ్రామం ఉపాధి కూలీలు తోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్ ప్రసాద్ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా పేస్ యాప్ లు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దీనివలన సమయం చాలా వృధా అవుతుందని అన్నారు. పనిచేసిన చోట మౌలిక సదుపాయాలు పట్ల దృష్టి పెట్టడం లేదని పంటలు మంచినీరు మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలో మహాత్మా గాంధీ పేరుతో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వాలకు భారాలను వేయకుండా కేంద్రమే పూర్తిగా బాధ్యత పడాలని ఉపాధి హామీ చట్టం ప్రజలు పోరాటాల వల్ల వచ్చింది తప్ప ఎవరు దయాదాక్షిని మీద రాలేదు 2005లో వచ్చిన ఉపాధి చట్టాన్ని నెరవేరించేస్తే భవిష్యత్ పోరాటాలకు కూలీలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి అవినీతికి తావు లేకుండా సక్రమంగా నడిపించాలని కూలీలకు గిట్టుబాటు కూలి ఇచ్చి న్యాయం చేయాలని వలసలు నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు పాచిపెంట మండలం పాంచాలి వద్ద బుచ్చం చెరువు వద్ద ఉపాధి కూలీలతో నిరసన కార్యక్రమం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి