నిరంతర పటిష్ట నిఘా ఉండాలి

నిరంతర పటిష్ట నిఘా ఉండాలి





పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోనవలస సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా , ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం పాచిపెంట మండలం పద్మాపురం, సాలూరు మండలం పి కోనవలస చెక్ పోస్ట్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద కేసుల నమోదు, నగదు, వాహనాలు సీజ్ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24 గంటలు నిరంతర పటిష్ట నిఘాను పెట్టాలని సూచించారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ద్వారా చెక్ పోస్ట్ తనిఖీలను కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. చెక్ పోస్టుల నుండి సీసీ కెమెరాలు పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విధమైన ఉదాసీనతను ప్రదర్శించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు తమతో పాటు తీసుకువెళ్ళే నగదు, బంగారం, ఆభరణాలు వంటి వాటికి విధిగా ఆధారాలు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మద్యం, మాదక ద్రవ్యాలు రవాణాపై గట్టి నిఘా ఉండాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  మండల పరిషత్ అభివృద్ది అధికారి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి