




పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బలగ రాధ అనే ఒక సామాన్యమైన మహిళ తన చుట్టుపక్కల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి వాళ్లకు న్యాయం చేయాలనే ఉదేశం తో 2017 లోస్ఫూర్తి మహిళా మండలి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు ఈ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించడంతోపాటు నియోజకవర్గంలో ఉన్న మహిళలకు తోడుగా నిలుస్తూ మహిళలకు వాళ్లు భవిష్యత్తుపై భరోసానిస్తూ మానసికంగా వాళ్ళు ఎదుగుదలకు తోడ్పడుతున్నారు ఈ స్ఫూర్తి మహిళా మండలి గత 7 సంవత్సరాలుగా మహిళలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అలాగే బాలికలకోసం వాళ్లు ఆత్మస్థైర్యం , విద్య, మానసిక ఎదుగుదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మండలి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటూ నియోజకవర్గం లో మహిళలకు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో గుర్తొచ్చేది స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలరాధ అంటూ ప్రతి మహిళకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతుంది