* సునీత రెడ్డి విజయనగరం కేరళ రాష్ట్ర గ్రామ పంచాయితీల పాలనపై..* *జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో..* *జిల్లా ప్రాదేశిక సభ్యులు అధ్యయనం..* *అలుప్పుజా జిల్లాలో కంజికుజి గ్రామ పంచాయితీ సందర్శన..* *జెడ్పీటీసీ బృందానికి సాదర స్వాగతం పలికిన..* *కంజికుజి గ్రామ పంచాయితీ అధికార, ప్రజాప్రతినిధులు..* *మరింత మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో..* : జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, జూన్ 16: సుపరిపాలనకు నిదర్శనంగా నిలిచే గ్రామ పంచాయితీల అభివృద్ధే దేశ అభివృద్ధి అని ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేర్కొన్నారు. అటువంటి గ్రామ పంచాయితీలను మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలనను అందించడం కోసం జిల్లా పరిషత్ నిరంతరం ఎన్నో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. తద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అనేక గ్రామ పంచాయితీల కు మౌళిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మంచి సుపరిపాలన అందించామని తెలిపారు. ఐతే రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజలకు ఇంకా మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో, అందుకు అవసరమైన మరిన్ని ప్రణాళికలు రూపకల్పన చేయాలనే ఉద్దేశ్యంతో, గ్రామ పంచాయితీ ద్వారా ఉత్తమమైన సుపరిపాలనను అందిస్తున్న కేరళ రాష్ట్రంలోని అలుప్పుజా జిల్లాలో గల కంజికుజి గ్రామ పంచాయతీ గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాదేశిక సభ్యులతో కలిసి మంగళవారం కంజికుజి గ్రామ పంచాయతీను సందర్శించినట్టు జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) తెలియచేశారు. కాగా స్థానిక సంస్థల బలోపేతం, గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులకు మరింత అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు తన స్వంత ఖర్చులతో ఈ నెల 13 న ఐదు రోజుల పాటు కేరళ టూర్ కు తీసుకువెళ్లడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో జడ్పీటీసీ సభ్యుల బృందం అలప్పుజా జిల్లాలోని కంజికుజి గ్రామ పంచాయతీని సందర్శించింది. ఈ సందర్భంగా కంజికుజి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు, వార్డు సభ్యులు, డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అశ్విన్, పంచాయతీ కార్యదర్శి డి.ఎఫ్. సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. జెడ్పీటీసీ సభ్యుల బృందం తొలుత గ్రామ సందర్శన చేసి, కంజికుజి గ్రామంలో మౌళిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పౌర సేవలు, సంక్షేమ పథకాలు గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంజికుజి గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్లి అక్కడి పంచాయితీ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై గ్రామ పంచాయితీల బలోపేతం గూర్చి పలు అంశాలను వారి నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతం, గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును జెడ్పీటీసీల బృందం అధ్యయనం చేసింది. ఈ పర్యటన ద్వారా అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని జడ్పీటీసీ సభ్యులు తెలిపారు. కేరళలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆతిథ్యం అందించిన కంజికుజి గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి జడ్పీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించేలా తమకు మరింత అవగాహన పెంపొందించుకునేందుకు తన స్వంత ఖర్చులతో కేరళ టూర్ ప్రోగ్రాం నిర్వహించిన జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ జిల్లాను సురక్షిత మరియు గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు