సునీత రెడ్డి విజయనగరం న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు : ఈ రోజు తేది 16-06-2026 న జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈశాన్యా రాష్టాల ప్రజల (NORTH -EAST people )కొరకు న్యాయ సేవా కేంద్రాన్ని గౌరవ శ్రీమతి M. బబితా గారు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ అధికార సంస్థ విజయనగరం వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా గౌరవ ప్రధాన న్యాయ మూర్తి గారు మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవా కేంద్రంలో మన దేశంలో ఈశాన్య రాష్టాల కు చెందిన కక్షి దారులు మరియు వివిధ సందర్భాలలో బాధితులకు ఈ ఉచిత న్యాయ సేవా కేంద్రం ఉపయోగపడుతుంది అని,బాధితులకు మరియు కక్షి దారులకు ఉచిత న్యాయ సలహ మరియు వివిధ కేసు లలో ఉచిత న్యాయవాది ఏర్పాటు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మరియు ప్యానెల్ లాయర్స్ ద్వారా ఉచిత న్యాయ వాదిని అందించబడుతుంది అని,బాల బాలికలకు, మహిళలకు, వృద్దులకు మరియు బాధితులు అందరికి జిల్లా న్యాయధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం అందజేయబడును. ఈ కార్యక్రమం లో గౌరవనీయులైన శ్రీమతి K. విజయకళ్యాణి గారు, మొదటి శ్రేణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయులైన B. అప్పలస్వామి గారు, కుటుంబ న్యాయ స్థానం మరియు మూడవ అదనపు జిల్లా న్యాయ మూర్తి, గౌరవ M. శ్రీధర్ గారు స్పెషల్ జడ్జి ఫర్ ట్రయిల్ అఫ్ కేసు అండర్ SC, ST act మరియు నాల్గవ అదనపు జిల్లా న్యాయ మూర్తి, గౌరవ శ్రీ G.దుర్గయ్య, PLAPUS జడ్జి, గౌరవ శ్రీ Dr. A. కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి జిల్లా న్యాయ అధికార సంస్థ, విజయనగరం, గౌరవ రమేష్ నాయుడు గారు, సీనియర్ సివిల్ జడ్జి విజయనగరం, గౌరవ శ్రీ M. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, గౌరవ NS HR తేజా చక్రవర్తి, మొదటి శ్రేణి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిష్టరేట్, గౌరవ కుమారి బుజ్జి గారు, మొబైల్ కోర్టు న్యాయ మూర్తి, గౌరవ శ్రీమతి శ్రీవిద్య, excise కోర్టు న్యాయ మూర్తి, గౌరవ శ్రీ బెల్లనా రవి గారు, member of high court Bar council, నలితం రమేష్,ప్రెసిడెంట్ విజయనగరం BAR అసోసియేషన్, ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది, కక్ష దారులు, పోలీస్ సిబ్బంది, లైజెన్ అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ జెడ్పీటీసీ బృందానికి సాదర స్వాగతం పలికిన. కంజికుజి గ్రామ పంచాయితీ అధికార, ప్రజాప్రతినిధులు..