ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మందు పాతర స్వాధీనం
ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి జిల్లా కలిమిల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొంపకొండ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు. కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడిగెట్ట నుండి BSF బలగాలు మావోయిస్టుల కోసం వెతుకుతుండగా, గొంపకొండ కెనాల్ వంతెనపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను సెర్చ్ ఫోర్స్ గుర్తించింది. మందుపాతర, డిటోనేటర్, 30 మీటర్ల ప్లాస్టిక్ వైరును స్వాధీనం చేసుకుని మందుపాతరను నిర్వీర్యం చేశారు