గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు సాలూరు:- మహిళలు అన్ని రంగాలలో రాణించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ.రాదా నాయుడు పిలుపునిచ్చారు.          అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడి పంచాయితీ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం అంటూ రిజర్వేషన్లు కల్పిస్తున్నా  మహిళలు ఇంకా కొన్ని గ్రామాల్లో అవగాహన లేక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందుకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం, ఒక గ్రామం, అభివృద్ధి చెందాలన్నా మొదట మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు.ప్రతి మహిళ వారి పిల్లల్ని విద్య పైన అవగాహన కల్పించి మంచి నడవడికతో పిల్లల్ని పెంచుతూ సమాజం పట్ల గౌరవాన్ని పెంచుతూ తన యొక్క పిల్లల్ని మంచి బాటలో నడిపించినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చందడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా బాలికల పైన మహిళల పైన తరచూ లైంగిక దాడులు జరుగుతున్నాయని ఈ విషయంలో ప్రభుత్వంతోపాటు మహిళలకు కూడా బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తేరగాలన్నారు. సమాజంలో జరుగుతున్న మంచి, చెడు  సంఘటనలపై ప్రతి తల్లి వారి పిల్లలకు తెలియపరచాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో బాల్య వివాహాలు జరపడం జరుగుతుందని బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా  నేరమని బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అనంతరం గిరిజన మహిళలతో  కలసి ఆమె దింసా నృత్యాన్ని చేసారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య ప్రెసిడెంట్ సీతమ్మ, స్ఫూర్తి మహిళా మండలి సాలూరు రూరల్ ప్రెసిడెంట్ జ్యోతి, సత్యవతి గిరిజన మహిళలు పెద్దలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి