సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు*

చీపురుపల్లి
తేది : 14-11-2024
గురువారం

*సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు*

చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే మరియు దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదిన వేడుకలు కరస్పాండెంట్ వలిరెడ్డి పద్మ, ప్రధానోపాధ్యాయులు గవిడి భారతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా పిల్లలందరూ వివిధ వేషధారణలో పాల్గొని అనంతరం  మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పిల్లలందరికీ మిఠాయిలు పంచి పెట్టారు ఈ సందర్భంగా విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూమన దేశ తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు 1889, నవంబర్ 14 న జన్మించారు. ఆయనకు పిల్లలంటే ఎంతొ ఇష్టం. అందుకే నవంబర్ 14 న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు అన్నారు
ఈ రోజున పిల్లలకు చాలా మంది రకరకాల ఆక్టివిటీస్,  పిల్లల చేత స్పీచ్ లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి వేషధారణలో రెడీ అయ్యారు. విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, మైండ్ రిలాక్స్ ఆటలు కూడా ఆడిస్తున్నం అన్నారు.  అయితే చాలా మంది బాలల దినోత్సవం నేపథ్యంలో తమ పిల్లలకు ఇష్టమైన వాళ్లకు స్పెషల్ గా విష్ చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్తుంటారు. అందుకే మీ పిల్లలు లేదా మీకు తెలిసిన దేవుని ప్రతిరూపాలైన బాలలకు ఈ విధంగా మీరు విష్ చేయోచ్చు అని అన్నారు.
హ్యాపీ చిల్డ్రన్స్ డే.. మీ పిల్లలకు ఎడ్యుకేషన్ లో మంచిగా రాణించాలని కోరుకుంటూ, ఏక సంతా గ్రహిలాగా ప్రతి విషయాలన్ని నేర్చుకుని జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటూ బాలల దినోత్సవ  శుభాకాంక్షలుతెలియజేసారు.
ఈ కార్యక్రమం లో పి.టి. రేవతి, ఉపాధ్యాయుని,  ఉపాధ్యాయులు స్కూలుకి ఇబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *