డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత


డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.విజయనగరం జిల్లా

శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామం లో డయేరియా తో బాధపడుతున్న 16 మంది పిల్లలు వారిని నేడు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అందులో ఒకపాపకి పరిస్థితి విషమం. వీరంతా విజయనగరం జిల్లా రామవరం గ్రామం వద్ద ఉన్న ఒక క్రిస్టియన్ స్కూల్ లో చదువుకుంటున్నారు, అయితే నిన్న బుధవారం నాడు స్కూల్ లో మధ్యాన్నం భోజనం చేసిన తరువాత వీరందరికి ఫుడ్ పాయిజన్ అవటం తో స్కూల్ సిబ్బంది కొంత మంది విద్యార్థులను విజయనగరం జిల్లా ఆసుపత్రికి చికిత్స కొరకు తీసుకువెళ్లి మిగతా వారందరిని తమ తమ ఇండ్ల కు పంపించవేయగా , శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర పంచాయితీ చిట్టిపాడు గ్రామానికి చెందిన పదహారు మంది విద్యార్థులు తమ గ్రామానికి చేరుకున్న తరువాత వీరందరికి వాంతులు విరోచనాలు అవటం తో అందులో మజ్జి సన్యాసమ్మ 9 సంత్సరాల బాలికకు పరిస్థితి విషమంగా ఉండటం తో ఈ రోజు ఉదయం వీరందరినీ శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆసుపత్రి సిబ్బంది వీరికి వైద్యం అందిస్తున్నారు, ఆసుపత్రి వద్ద పీహెచ్సి డాక్టర్ శిరీష , తమ సిబ్బంది తో కలసి వీరి వైద్యం అందిస్తున్నారు, రెవిన్యూ సిబ్బంది ఆసుపత్రి వద్ద పర్యవేక్షిస్తున్నారు, ప్రస్తుతం ఆసుపత్రి వద్ద వైద్యం అందుకుంటున్న విద్యార్థులు సన్యాసమ్మ 9 సంత్సరాలు, జాన్ని నవ్య 9
సోముల కావ్య 5, మజ్జి దీన 7
మజ్జి జాకెరంగి సోకి 8లు , వీరిని శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఆసుపత్రి వద్దకు వచ్చి పరమరశించి వీరికి మెరుగాయిన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి