విజయనగరంలో ఘనంగా కల్యాణ్ పడాల ‘ఫ్లేమ్ టూర్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేత కల్యాణ్ పడాలకు ఘన స్వాగతం విజయనగరం: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేత, విజయనగరం ముద్దుబిడ్డ కల్యాణ్ పడాల ‘ఫ్లేమ్ టూర్’ విజయనగరంలో సందడిగా జరిగింది. బిగ్‌బాస్ విజేతగా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఆదరణ పొందిన కల్యాణ్ పడాలకు అభిమానులు, యువత ఘన స్వాగతం పలికారు. విజయనగరం జిల్లాకు చెందిన కల్యాణ్ పడాల బిగ్‌బాస్ హౌస్‌లో తన క్రమశిక్షణ, పట్టుదల, సహనంతో పాటు అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ‘ఫ్లేమ్ టూర్’లో కల్యాణ్ పడాలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కల్యాణ్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, తన బిగ్‌బాస్ ప్రయాణంలో విజయనగరం ప్రజలు, అభిమానులు అందించిన ప్రేమ, మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. విజయనగరం నుంచి బిగ్‌బాస్ వేదిక వరకు సాగిన తన ప్రయాణం ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే సాధ్యమైందని కల్యాణ్ పడాల పేర్కొన్నారు. ఫ్లేమ్ టూర్ సందర్భంగా అభిమానుల ఉత్సాహం, కేరింతలతో విజయనగరం సందడిగా మారింది. కల్యాణ్ పడాల ఫ్లేమ్ టూర్‌కు అభిమానుల నుంచి ఘన స్పందన లభించింది. Spread the love టపా నావిగేషన్ సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర