*భీమిలి నియోజకవర్గం, ఆగస్టు 10:*

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న *AP Gen-Z WAR* కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన *నిరసన ర్యాలీని* పోలీసులు అడ్డుకున్నారు.

చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో సమీకరించారు. *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) * వారి కుమార్తె *సిరి సహస్ర* సోమవారం ర్యాలీని ప్రారంభించేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు విధించిన ఆంక్షలపై చిన్న శ్రీను తీవ్రంగా స్పందించారు.

డీఎస్సీ నియామకాలపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం సమగ్రంగా స్పందించకుండా నిరసనలను అడ్డుకోవడం సరికాదని అన్నారు. నియామక ప్రక్రియపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు రావాల్సిన చోట ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండకూడదని, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతలో నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే మీడియాతో మాట్లాడి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తమ నిరసనను తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదని అన్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, నియామక ప్రక్రియపై పూర్తి పారదర్శకత వచ్చే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని చిన్న శ్రీను గారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ SEC మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు ,కార్పొరేటర్లు. జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్థానిక ముఖ్య నాయకులు , ప్రజా ప్రతినిధులు , వైసిపి కార్య కర్తలు , చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు , వేలాది మంది ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి