పార్వతీపురం మణ్యం జిల్లా, సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూలు ను ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన సామాజిక తనిఖీ బృందం డీ.ఆర్పీ.నారాయణ మూర్తి గారు,బి.శివ గారు* పరిశీలించారు. ప్రిన్సిపాల్ గాదిపల్లి.ప్రశాంతి సమక్షంలో పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం నిర్వహణకు సంబంధించిన రికార్డులను,వసతి గృహంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు,విశ్రాంతి గదులు తనిఖీ చేశారు.స్కూల్ క్రీడా మైదానం,ఇతర సౌకర్యాలను పరిశీలించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు

