భీమిలి, ఆగస్టు 21:

భీమిలి నియోజకవర్గం, భీమిలిలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర ఆలయం గత 130 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సోదరులు భక్తులు ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తూ నేడు ఆలయాన్ని ఒక విశిష్ట స్థాయికి తీసుకువచ్చారు. ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు వివిధ సంస్కృతి కార్యక్రమాలు అల్పాహారం అన్న ప్రసాద విందు వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

వారి ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌ!!శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి ముందు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

తదననంతరం సిరమ్మ ఆలయ కమిటీ వారు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి