పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి – జడ్పీటీసీ వలిరెడ్డి

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి – జడ్పీటీసీ వలిరెడ్డి

చీపురుపల్లి

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి – జడ్పీటీసీ వలిరెడ్డి

రేవు వినాయక చవితి సందర్బంగా ఈ రోజు సాయంత్రం తన నివాసంలో మట్టి వినాయక ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకంలను ఉచితగా ప్రజలకు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, విజయనగరం జిల్లా వైస్సార్సీపీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పార్టీ నాయకులు మొండేటి శ్రీను (గాజులు శ్రీను), ప్రభాత్ కుమార్, చంద్రశేఖర్ గుప్తా, పి. వలిరెడ్డి పద్మ, శోభన,గణేష్, మన్నె చిన్ని, చక్రి, వెంకటేష్, కుటుంబం సభ్యులుతో కలిసి అందజేసారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ

వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టమూ రానివ్వడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసులలో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే నీళ్ళు పూర్తిగా కలుషితమైపోతాయి. మట్టి వినయాకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే వుండదు. అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకీ మంచిది, పర్యావరణానికీ మంచిది. పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసేవారినే ఇష్టపడతాడు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి