


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో అటవీ శాఖ రేంజర్ అధికారి తవిటి నాయుడు గారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ అంతరించి పోతున్న వన్యప్రాణులను మనం రక్షించు కోవాలని దీని కోసం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వాటికి కూడా మనలా జీవించే హక్కు ఉందని వాటిని చంపటం అక్రమ రవాణా చేయటం చట్టరిచ్ఛ నేరమని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్.. గంగరాజు, శ్రీనివాస్, దేవరాజు మరియు రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ పాల్గొన్నారు.
