*మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి* –మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, మార్చి 8: మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను గత రెండు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, మహిళలతో నిరంతరం మాట్లాడే అవకాశం లభించిందని అన్నారు. తన జీవితంలో తల్లి, అక్క, భార్య, చిన్న కుమార్తె ఉన్నారని, మహిళలు కుటుంబానికి ఎంతో ముఖ్యమని చెప్పారు. మహిళలు లేకుండా ఏ పండుగ కూడా పూర్తి కాదని, అలాంటి మహిళలను ఇచ్చిన భగవంతుడిని ఎప్పటికీ మరవలేమని అన్నారు.ప్రతి కుటుంబానికి ఒక ఇంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అప్పట్లో పదిమంది మహిళలు కలిసి పొదుపు చేసే చిన్న సంఘాలుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు భారీ ఉద్యమంగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు.గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు. మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో స్త్రీ శక్తి పథకం ముఖ్యమైనదని పేర్కొన్నారు. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది విద్యార్థినులు ఇంటర్మీడియట్ తర్వాత చదువును ఆపివేసేవారని, అయితే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో వారు తమ చదువును కొనసాగిస్తున్నారని గుర్తు చేసారు.మహిళల భద్రత కోసం పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ మహిళల్లో ధైర్యాన్ని పెంచుతుందన్నారు. అదేవిధంగా మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ అందించారని గుర్తుచేశారు. ప్రస్తుతం దీపం-2 పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నారని చెప్పారు.మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం సింగిల్ ఉమెన్ పెన్షన్ వంటి పథకాల ద్వారా కూడా తోడ్పడుతోందన్నారు. మహిళల అభివృద్ధి మరియు రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఆలోచనలు మరియు మాటలను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు మరింతగా ముందుకు సాగాలని ఈ సందర్బంగా మంత్రి పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత కోసం ఉద్యమాలు చాలా కాలం క్రితమే ప్రారంభమయ్యాయని, 1908 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కోసం ప్రారంభమైన ఉద్యమాలు, 1917లో రష్యాలో మహిళలు శాంతి కోసం చేసిన నిరసనలతో మహిళా దినోత్సవానికి ఆవిర్భావం కలిగిందన్నారు.మహిళల గురించి మాట్లాడితే తనకు మొదటగా తన తల్లి గుర్తుకు వస్తారని కలెక్టర్ అన్నారు. కుటుంబాన్ని చూసుకుంటూనే వ్యవసాయం నిర్వహిస్తూ ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన తన తల్లి వంటి మహిళలు ప్రతి కుటుంబానికి వెన్నుముకలుగా ఉంటారని చెప్పారు.మహిళలను ఆర్థికంగా స్వావలంబకులుగా తీర్చిదిద్దేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా అదే భావనతో మహిళలు సంఘాలుగా ఏర్పడి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మహిళా సాధికారతలో మనం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో మహిళలు మరింతగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తపరిచారు.కార్యక్రమం లో ముందుగా మంత్రివర్యులు, కలెక్టర్, ఎమ్మెల్యే తదితర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమం లో భాగంగా సిఐఎఫ్, బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి, ఉన్నతి, పిఎమ్ఎజెవై పధకాలకు సంబంధించి 1566.68 కోట్ల రూపాయలు చెక్కును లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా 2601 సంఘాలకు రూ. 336.83 కోట్ల విలువ గల చెక్కును పంపిణీ చేసారు. ఈ సందర్బంగా స్వయం సహాయ సంఘ సభ్యులు, అంగన్వాడీ సహాయకులు, క్రీడాకారిణిలు, శక్తి టీమ్ తదితర 25 మంది మహిళా అచీవర్స్ ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలుగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు ఆదితి గజపతిరాజు తూర్పు కాపు రాష్ట్ర చైర్మన్ పాలవలస యశస్వి, మార్క్ పెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు, సంయుక్త కలెక్టర్ ఎస్ సేదు మాధవన్, డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ ఫణి, పలువురు జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. Spread the love టపా నావిగేషన్ సాయి సూర్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్)