– అనంతపురం జిల్లా
శ్రీ రామాలయ రథానికి నిప్పు పెట్టిన దుర్మార్గులు
అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని శ్రీరామాలయం రథానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.
అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనను స్థానికులు గమనించి మంటలను ఆర్పివేయగా అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కళ్యాణ దుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో విచారణ ముమ్మరం చేశారు. కాలిపోయిన తలుపును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దగ్ధమైన స్థలంలో నిందితుడి గురించిన విలువైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో లభించిన సమాచారం మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు