మెరకముడిదాం జడ్పీహెచ్ఎస్ స్కూలుకు క్రీడా పరికరాలు అందజేసిన విలేజ్ మైండ్స్ ఐటీ కంపెనీ.
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో జడ్పీహెచ్ స్కూలుకు క్రీడా పరికరాలను వుటపల్లి గ్రామానికి చెందిన విలేజ్ మైండ్స్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్, చైర్మన్, సంఘం రెడ్డి భానుమూర్తి, కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి,గాయత్రీ వెంకటేశన్ సుమారు 50000 రూపాయులు తో స్కూలుకు అవసరమయ్యే క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని క్రీడల్లో రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించాలని విలేజ్ మైండ్స్ కంపెనీ ఫౌండర్ చైర్మన్ సంఘం రెడ్డి భానుమూర్తి ఆకాంక్షించారు.
క్రీడా పరికరాలను కంపెనీ ఫౌండర్ చైర్మన్ తండ్రి సంగం రెడ్డి సన్యాసినాయుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోట్ల ఎల్లమ్మ్ నాయుడుకు క్రీడా పరికరాలు అందజేశారు.
మెరకముడిదాo పాఠశాల తరఫున విలేజ్ మైండ్స్ కంపెనీ ఫౌండర్,చైర్మన్ సంఘం రెడ్డి భానుమూర్తి మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి గాయత్రి వెంకటేశన్ లకు ప్రధానోపాధ్యాయులు మరియు సహచర స్కూల్ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.