ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం


విలువలతో కూడిన జీవనమే ఎవరికైనా శ్రీరామరక్ష అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ హిమబిందు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీడబ్ల్యూజేఏ) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పుష్కరపులో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిమబిందు మాట్లాడుతూ విలువల జీవితం లేని పక్షంలో చట్టాలు కూడా ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. విలువల జీవితం ప్రతి వ్యక్తి బ్రతుకులో ఎంతటి ఉన్నత స్థాయిని కల్పిస్తుంది అన్నది ఆమె విపులంగా వివరించారు. నేటి విద్యార్థినులకు ఈ జీవనం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీడబ్ల్యూ జేఏ రాష్ట్ర అధ్యక్షురాలు దేవి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం అంతకంతకు పెరుగుతోందన్నారు. మహిళా పాత్రికేయుల గౌరవాన్ని పరిరక్షిస్తూ వారిలో చైతన్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా యూనియన్ పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. త్వరలోనే తమ యూనియన్ జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి స్వప్న హైందవి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలోనే మహిళకు అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. మహిళని ఒక దేవతగా ఆరాధించి పూజించే సంప్రదాయం మనది అన్నారు. ఒకప్పుడు తల్లి చేతి వంట తిని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిందని ఈ కారణంగానే వైద్యశాలలో ఐసీయూల సంఖ్య పెరుగుతో వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆడది వంటింటి కుందేలు అన్న వాదన వాస్తవం కాదని ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రపంచం తెలుసుకుంటుందని చెప్పారు. ప్రాచీన భారతంలో సమానత్వం బేషుగ్గా అమలు అయ్యేదని వివరించారు. ప్రముఖ జ్యోతిష్కురాలు రచయిత్రి జి మహాలక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమకి తాము ఎదగాలన్న తపన ఉన్నప్పుడే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు అన్నారు. ప్రభుత్వ కళాశాల ప్రధానోపాధ్యాయురాలు రమణమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తొలి గురువు మాతృమూర్తి అని అన్నారు. మరో ఉపాధ్యాయురాలు సిహెచ్ వి రత్నం మాట్లాడుతూ పిల్లల పెంపకం తల్లి ఆలనా పాలనపై ఆధారపడి ఉంటుందన్నారు. మొత్తం కుటుంబం తల్లి పై ఆధారపడి ఉంటుందని కుటుంబంలో మహిళ ప్రాధాన్యత ఏమిటి అని చెప్పడానికి ఇదొక్కటే మచ్చుతునక అన్నారు. దుదృష్టవశాత్తు అత్యధిక మంది మహిళలు ఆధునిక పోకడల పేరుతో పలు అకృత్యాలకు పాల్పడుతుండటం దురదృష్టకరమన్నారు. మన శరీరం మన మాట వినేటట్లు చేసుకోగలిగితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నారు. న్యాయవాది గణపతిరాజు శ్రావ్యా మాట్లాడుతూ ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా తన హక్కుల గురించి తాను తెలుసుకొని సమానత్వంతో సమూన్నత స్థాయికి చేరుకోవాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించారు. మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి తన సమస్యను చెప్పగలిగినప్పుడే తన హక్కులకు సార్ధకత చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి కోశాధికారి సీమ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళా ప్రముఖులకు ఉచితరించిన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రక్తదానశిబిరం

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరానికి చెందిన ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 22 మంది పాల్గొని రక్తదానం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి