పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శ్రీ సాయి సూర్య స్కూల్లో మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లుల తో ఆట లాడించి గెలిచిన వాళ్లకు బహుమతి ప్రధానం చేసి అనంతరం మహిళలకు సన్మానం చేసి సత్కరించారు. ప్రతి ఏటా ఇలానే మహిళలకు ఆటలాడించి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఈ ఆటల పోటీల్లో పాల్గొన్న ప్రతి తల్లి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలను ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా స్కూలు యాజమాన్యం మాకు గుర్తు చేశారని అనుక్షణం ఉద్యోగాలు చేస్తూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలను విద్యావంతులు చేయాలని అహర్నిశలు కష్టపడుతున్న తల్లులందరి కీ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయించడం వల్ల మాకు కొంత మానసిక ఉల్లాసం కలుగజేస్తాయని తల్లులందరూ ఇలా ఒక చోట కలిసి ఆటల్లో పాల్గొనడం బహుమతులు పొందడం యాజమాన్యం చేసే సన్మాన సత్కారాలు తమకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని మాకు చాలా ఆనందంగా ఉందని సాయి స్కూల్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని విద్యతోపాటు పిల్లల ఆరోగ్యం మరియు తల్లుల మానసిక ఉల్లాసానికి తమ వంతు కృషి చేస్తున్న యాజమాన్యానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు Spread the love టపా నావిగేషన్ గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి (మంత్రి కొండపల్లి శ్రీనివాస్)