రాష్ట్ర మన్యం బంద్

మన్యం హక్కులపై నినదించిన యువత.
పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం.
   రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు మన్యం బందులో భాగంగ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ర్యాలీ నిరసన నిర్వహించారు.
కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఏజెన్సీ గిరిజన సంఘం, డివైఎఫ్ఐ ,సిఐటియు నాయకులు పాల్గొన్నారు
  కార్యక్రమం ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి అఖిల్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడుతూ
   నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో కలపాలని, రద్దుచేసిన జీవో మూడును అమలు చేసి ,గిరిజన ప్రాంతాల్లో 100% పోస్టులను గిరిజన యువతతో భర్తీ చేయాలని ,ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
  రాష్ట్రంలో గిరిజన ప్రాంతం సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వచ్చే ఎన్నికల్లో గిరిజన సంస్థలపై స్పష్టమైన
ఎజెండాలను అన్ని పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో ప్రకటించాలని లేకుంటే అలాంటివారికి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
  కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి